నిర్దేశించిన 100 మీటర్ల పరిధిలో కి ఓటర్లను మాత్రమే అనుమతించాలి

కృష్ణా జిల్లా:- రెడ్డిగూడెం

రెడ్డిగూడెం మండలంలోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన, రెడ్డి గూడెం, రంగాపురం, పోలింగ్ కేంద్రాలనును జిల్లా SP శ్రీ రవీంద్ర నాథ్ బాబు ఐపిఎస్ సందర్శించారు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

నిర్దేశించిన 100 మీటర్ల పరిధిలో కి ఓటర్లను మాత్రమే అనుమతించాలి

ఓటు వేసిన అనంతరం వెంటనే పోలింగ్ కేంద్రాల నుండి ప్రజలను పంపి వేయాలి సూచించారు

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులు, గుంపులుగా ఉండకుండా పోలీసులు విధులు నిర్వహించాలి తెలిపారు

ఈరోజు నూజివీడు రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో జరిగే నాలుగో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి అని తెలిపారు

ఇప్పటివరకు 40 శాతం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది

అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

కౌంటింగ్ ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, రాత్రి 10 గంటల లోపు కౌంటింగ్ పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నాం అని రవీంద్రబాబు ఐపీఎస్ తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.