నిర్మాణాలు నిలిచిపోయిన 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల డబుల్ బెడ్ రూమ్

*

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించాలి!!
————–==———–
(CPM జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్.)

3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలు నిధులు లేక నిలిచిపోవడం జరిగిందని వెంటనే నిధులు మంజూరు చేసి, త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 08-02-2021సోమవారం రోజున cpm జిల్లా కమిటీ, 3డవ విడత ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల పోరాట కమిటీ ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది, అనంతరం కలెక్టర్ కార్యాలయం A.O అండాలు గారికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వనైనది. ఈ కార్యక్రమంలో cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలైన 1147 మంది లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ ఇండ్ల నిర్మాణాలు చేపట్టకపోడంతో పేదలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత 2 సంవత్సరాల క్రితం లబ్ధిదారులు వారికి ఇచ్చిన పట్టా స్థలాల్లో చిన్న రేకుల ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ఈసంధర్బంగా ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల క్రితం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఈ చిన్న రేకుల ఇండ్లు ఖాళీ చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు, మరియు cpm నాయకులు కలిసి లబ్ధిదారులతో పది దఫాలుగా చర్చలు జరిపి ఇండ్లు ఖాళీ చేయించడం జరిగిందని గుర్తుచేశారు. గత 18 నెలల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని, పని ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపారు. కావున వెంటనే నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చెసి, త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలను పుర్తి చేసి 3డవ విడత ఇందిరమ్మ లబ్దిదారులకు ఇండ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, బోట్ల శేఖర్, పట్టణ నాయకులు జోగు ప్రకాష్, B.చందు నాయక్, లబ్ధిదారులు K.లింగం, Md.గౌసియా, నజియా, Y.రజిత, P.లక్ష్మి, K.రాజు, కళ్యాణ్, P.సోమయ్య, P.వెంకటేష్, P.చందు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.