నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కె. శశాంక

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లా కేంద్రంలోని కురవి రోడ్డులో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనుల పురోగతిపై నిర్మాణ ప్రాంతంలో సంభందిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలనీ, మొక్కలకు నీరు అందే విధంగా అదనంగా ఒక బోర్వేల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. లాన్ పనులు, గ్రిల్ పనులు, ఫర్నీచర్ ఏర్పాటు, బి.ఎస్. ఎన్. ఎల్. సెటప్ పనులు. భవనం వెనక వైపు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని, విద్యుత్ పోల్స్ పనులు, ఫినిషింగ్ పనులు పూర్తి చేసి త్వరగా అందించాలని తెలిపారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేయు సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లపై సమాచార శాఖ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పెద్ది భూపాల్ తో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, డి.హెచ్. ఎస్. ఓ. సూర్య నారాయణ, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ పెద్ది భూపాల్, ఆర్డీవో కొమురయ్య, తహసిల్దార్ నాగభవాని, కాంట్రాక్టర్ కిషోర్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.