డోర్నకల్ నియోజక వర్గంలో రూ. 21 కోట్ల వ్యయంతో 84జీ పీ ల నిర్మాణాలు
డోర్నకల్ ఎమ్మేల్యే డీఎస్ రెడ్యానాయక్ కృతజ్ఞతలు
జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపుడి నవీన్ రావు వెల్లడి
గిరిజన మారుమూల తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి జిపిల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నారు గిరిజనులకు స్వయంపాలన అందించి అందించి ప్రజలకు మరింత సౌకర్యం కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన తండాల్లో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహుల పేట ,మరిపెడ కురవి ,డోర్నకల్ ,దంతాలపల్లి, చిన్న గూడూరు మండలాల్లో నూతనంగా ఏర్పడిన గిరిజన తండాల పంచాయితీ భవనాల ఏర్పాటు కోసం రూపాయలు 25 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరి చేయనందున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలోని 84 గ్రామపంచాయతీల భవనాల నిర్మాణాలకు గాను 21 కోట్లను మంజూరి చేనుందన్నారు. నూతన భవనాల నిర్మాణానికి డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ చేసిన కృషి హర్ష నియమన్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటారని తెలిపారు. సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా నాయకుడు నా రెడ్డి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.