నూతన రైతు వ్యవసాయ చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల

నూతన రైతు వ్యవసాయ చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ గార్కి మెమోరాండం,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు వ్యవసాయ, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు, బుధవారం స్థానిక మండల కేంద్రంలోనిసిఐటియు ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్, విజయ భాస్కర్ గారికి అందజేశారు, ఈ సందర్భంగాసోమన్న పాల్గొని మాట్లాడుతూ దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చెపడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు,కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక,వ్యతిరేక చట్టాలతో కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు,అదానీ, అంబానీ, లాంటి పెట్టుబడిదారులకు లాభాలు ఉంటాయని,సన్న, చిన్న, రైతాంగం దివాలా తీసి భూమి నుంచి వేరు చేయడతారని వారన్నారు,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని తెలిపారు,ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం దేశప్రగతికి నూతన చరిత్రను అందిస్తుందని, ప్రజాస్వామిక పోరాటాలకు మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు, రైతన్న ఉద్యమానికి ప్రగతిశీల శక్తులు అన్ని వర్గాల ప్రజానీకం సంఘీభావం తెలపాలని అన్నారు, ఈ సమావేశంలో సిపిఎం నాయకులు జీడి సోమయ్య,సిఐటియు నాయకులు, సోమ అశోక్ బాబు, బక్క నరసయ్య, ఎనగతలవెంకన్న, బెల్లిభాస్కర్, ఎనగతల సమ్మయ్య, సోము చంద్రు, పెద్దాపురం, రామచంద్రు, కుమార్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.