నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్

తేది 28/12/2020
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.

-“గోదావరి జల సాధనకై “

_-కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమం..

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులైన దేవాదుల ఫేజ్-3, కాళేశ్వరం 3వ TMC ఎత్తిపోతల, రామప్ప- పాఖాల, రామప్ప-రంగాయ చెరువు, మిషన్ భగీరథ, తుపాకులగూడెం & సమ్మక్క-సారలమ్మ బ్యారేజిలను నిర్మాణ పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి మంత్రి ఇచ్చిన ఆదేశాలను రద్దుచేసి, ఆంక్షలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమం సర్వ సిద్ధంగా ఉండాలని మండల అధ్యక్షులు తెలపడం జరిగింది.

ఈ నిరసన (ధర్నా) కార్యక్రమంలో పాల్గొననున్న పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి , పెద్ది సుదర్శన్ రెడ్డి , ఆరూరి రమేష్ ,
గండ్ర వెంకటరమణ రెడ్డి .

‘గోదావరి జల సాధన’ పార్టీలకు అతీతంగా నిర్వహించే ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమానికి రూరల్ జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు,వ్యవసాయ మార్కెట్ మరియు సొసైటీ చైర్మన్లు, రైతుబంధు సమీతీ సభ్యులు,తెరాస నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై నిరసన(ధర్నా) కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

తేదీ: 29-12-2020 (మంగళవారం),

సమయం: ఉ౹౹. 10:00 గం.లకు

వేదిక: హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీగా కొనసాగి వరంగల్ రూరల్ కలెక్టరేట్ చేరి నిరసన(ధర్నా) ఈ కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మకూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి కోరడం జరిగింది

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.