నేటి దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయండి

నేడు జరిగే దేశ వ్యాప్త బందును జయప్రదం చేయాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోమ సత్యం పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో కామ్రేడ్ వీరనారి ఐలమ్మ స్మారక భవనంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, టిడిపి, బహుజన, సామాజిక సంఘాలతో రైతు ఉద్యమానికి మద్దతుగా బంద్ సన్నాహక సమావేశాన్ని సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రమేష్ రాజా, సత్యం మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాల మూలంగా రైతాంగం పడుతుందని నష్టపోతుందని తెలిపారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కోటి ఇరవై లక్షల మంది రైతులు ముట్టడించ్చరని, 11 రోజులుగా రైతాంగం ఢిల్లీలో చలిని సైతం లెక్కచేయకుండా ఆందోళన ఉధృతం చేస్తుందని, శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. రైతు ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుందని, రైతులపై లాఠీచార్జి ప్రయోగించిందని తెలిపారు. దేశ వ్యాప్త బంద్ కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక, సామాజిక సంఘాలు మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. కనివినీ ఎరుగని రీతిలో ఉద్యమం నడుస్తోందని, కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదని హెచ్చరించారు. నేడు జరగబోయే దేశవ్యాప్త బంధువులు పాలకుర్తి ప్రజానీకం, వ్యాపార వాణిజ్య, హోటల్ తదితర సంఘాలు సహకరించి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి స్వామి, బహుజన కులాల ఐక్యవేదిక అధ్యక్షులు గుమ్మడి రాజు సాంబయ్య, అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దూరు సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఐలేష్ తెలంగాణ ఉద్యమ కారుల సంఘం మండల అధ్యక్షులు జి డి హరీష్ పన్నీరు యాకన్న, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జలగం నరేష్, గాదెపాక భాస్కర్, ద్రవిడ బహుజన సమితి జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్, నాయకులు జలగం ప్రవీణ్, టిడిపి అధ్యక్షులు ల్యాబ్ వెంకన్న, సిపిఎం నాయకులు మాచర్ల సారయ్య, లిబరేషన్ నాయకులు జీడి సోమన్న, తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి

By E69NEWS

One thought on “నేటి దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయండి”

Leave a Reply

Your email address will not be published.