విశ్వవ్యాప్త అహ్మదియా ముస్లిం జమాఅత్ ప్రస్తుత కేంద్రం లండన్ లో ఈ నెల 5,6,7 శుక్ర,శని,ఆది వారాలలో ప్రపంచ అహ్మదియ్య ముస్లిం జమాఅత్ వార్షిక సమావేశాలు జరుగనున్నాయని దక్షిణ భారత అహ్మదియ్య ప్రచార కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఎ జైనుల్ ఆబిదీన్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా రెండు వందలకు పైగా దేశాల నుంచి ప్రతినిదులు పాల్గొంటున్న సభా కార్యక్రమాలు శుక్ర వారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం ఐదు గంటలకు అహ్మదియ్య ఐదవ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ఖలీఫత్తుల్ మసీహ్ ఖామిస్ అహ్మదియ్య జండా ఎగురవేసి ప్రారంభం చేస్తారని అన్నారు. ఖలీఫా అయ్యదహుల్లాహ్ విశ్వాస భరితమైన నాలుగు సుప్రధాన ఉపన్యాసములు, మరియు చివరి రోజున సాయంత్రం అయిదు గంటలకు ఆలమి బైఅత్బైఅత్(ప్రపంచ అహ్మదియ్యత్ లో చేరికలు)కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయులు ఈ కార్యక్రమాలను ఎంటిఎ టివి ద్వారా,యూట్యూబ్ మరియు ఎంటిఎ యాప్ ద్వారా అధిక సంఖ్యలో వీక్షించాలని వారు కోరారు.