న్యాయపరమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలి..
నిర్దిష్ట కాలపరిమితి లో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలి..
ఎస్.ఎఫ్.ఐ మధిర టౌన్ కమిటీ..
రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నాలు చేయడం హర్షణీయం అని అదే సమయంలో న్యాయపరమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితి లో ఉద్యోగాల భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యుడు జగదీష్ అన్నారు.. గతం లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసి న్యాయస్థానం జోక్యం తో సంవత్సరాల కాలం ఉద్యోగాలు భర్తీ కాలేదు అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ భర్తీ ప్రకీయ పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ మాటా నిలబెట్టుకోవాలని కోరారు