తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి

తునికి మహేష్

గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారాని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ అన్నారు. మంగళవారంనారాయణరావుపేట మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ కార్మికులకు 8500 ఇస్తున్నామని చెప్పడానికే తప్ప ఆచరణలో కనబడటం లేదని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా జీతాలు రాక కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 51 వల్ల 500 జనాభాకు ఒక్క కార్మికుడు ఉండాలని నిబంధన వలన అనేక మంది కార్మికులను తొలగించడం జరిగింది. మల్టిపర్పస్ విధానంతో పంచాయతీ ఉద్యోగ, కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని పెన్ను పట్టి రాసె కరోబర్ లను పరపట్టి మురికాలు తీయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు మెమో 2026 తో పంచాయతీ కార్మికులు పాఠశాలల్లో మరుగుదొడ్లు కడగలని జిల్లా అధికారులమొదలు మండల అధికరుల వరకు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఎస్కడే 2 లక్షల ఇన్సూరెన్స్ ప్రకతనాలకే పరిమితం అయిందని పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనం19వేలు కొత్త పీఆర్సీప్రకారం ఇవ్వాలని అలాగే జీఓ 51 సవరించాలని కరోబర్,బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలని, మెమో 2026 ను రద్దు చేయాలని, ప్రతినెలా 5వ తేదీన వేతనాలు చెలించాలని డిమాండ్ చేశారు.లేక పోతే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్citu అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్మికులు బాలు,నరేష్, ప్రశాంత్,మల్లయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.