పంచాయితీ కార్మికులకు పీఆర్సీ వర్తింపజేయాలని సీఐటీయూ డిమాండ్

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగ,కార్మికులకు పీఆర్సీ వర్తిపజేయలని, ట్రెజరీ జాప్యం వల్ల వేతనాల చెల్లింపులో జరుగుతున్న అలస్యాన్ని నివారించాలని,తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్&వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నారాయణరావుపేట సిద్దిపేట అర్బన్, రూరల్,మండల ఎంపీడీఓ కార్యాలయల ఎదుట ధర్నా నిర్వహించి MPDO కార్యాలయంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు,ఈసందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం తరువాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 30శాతం పిటమేట్తో పీఆర్సీ ని ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగానే 11వ పీఆర్సీ వచ్చింది. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సంక్షోభాలు వచ్చినప్పుడు ముందు వరుసలో నిలబడి తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సేవలదిస్తున్నారు. అతి తక్కువ వేతనలిస్తూ న్నా ప్రజా ప్రయోజనాల కోసం వీరు నిరంతరం శ్రమిస్తున్నారు .వీరి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. ఆశ ,అంగన్వాడీ, డైలీవెజ్ తదితరులను 11వ పీఆర్సీ లోకి తీసువచ్చిన ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మికులను,విస్మరించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్ సి వర్తింపజేస్తామన్నారే తప్ప స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఫిక్స్డ్ పే మల్టిపర్పస్ వర్కర్లు కు కూడా పీఆర్సీ వర్తింపజేస్తామనే స్పష్టత నివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా పీఆర్సీని ప్రకటించాలని ,పంచాయతీ సిబ్బందికి వేతనల చెల్లింపూలు ప్రతి 5వ తేదీలోప చెలించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో కార్మికులు, మల్లయ్య,రాజేష్, శ్రీకాంత్,నరేష్, అండాలు, ఎల్లవ్వ,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.