పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిసెంబర్ 8న జరిగే * రైతుల భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించిన *తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్యాక్షన్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మరియు తెలంగాణ ప్రైవేట్ టీచింగ్-నాన్ టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు…డా.సామల శశిధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రైతులను మోసం చేసి వారిని మభ్యపెట్టి
సన్న ధాన్యంమే పండిచాలి అని లేకపోతే రైతు బంధు, రైతు భీమా పథకాలకి అర్హులు కారు అంటు చెప్పి తన స్వంత వ్యవసాయ భూముల్లో దొడ్డు వడ్లు సాగు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైపోయాయి రైతులు పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర లేక పోతే బతకడం ఎలా,నియంత్రణ సాగు విధానం చేసిన ప్రభుత్వం సన్న ధాన్యంకి 2500/-మద్దతు ధర ప్రకటించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అర్హులైన ప్రతి రైతుకి పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని అదేవిధంగా.కేంద్రం తెచ్చిన 3 అగ్రి చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని,కేంద్రం ప్రభుత్వం లో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదని,వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ నెల 8 న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని రైతులు వ్యాపారవేత్తలు విద్యావంతులు ఈ బందులో పాల్గొని రైతులకు మద్దతు తెలిపాలని కోరారు. రైతే రాజు అని మాట్లాడిన ప్రభుత్వాలు రైతులకు మాయ మాటలు చెప్పి దేశవ్యాప్తంగా వారిని మోసం చేస్తూ వస్తున్నాయి కనుక ఇప్పటికైనా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేశవ్యాప్తంగా వారి రుణాలను మాఫీ చేసి వారికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను బిల్లులను వెంటనే రద్దు చేస్తూ వారు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అనే కాకుండా ప్రతి వస్తువు ఒక రేటు ఏ విధంగా ఉంటుందో మరి రైతులు పండించిన పంటకు అదేవిధంగా రేటును వారే నిర్ణయించుకునే విధంగా నూతన చట్టాన్ని తీసుకు రావాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందరిని కోరుతున్నాము

By E69NEWS

One thought on “పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి”

Leave a Reply

Your email address will not be published.