పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

జఫర్ గడ్ : *మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు
అనేక మంది రైతులు తమ గోడును సిపిఎం నాయకులకు విన్నవించారు. తమ్మడపల్లి (జి ) లో ఎండిపోతున్న పంటలు పరిశీలించిన సిపిఎం
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్యలు మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు ఒక ఎకరం పంట కూడా ఎండ నివ్వమని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు ఆచరణకు నోచుకోలేదు అని అన్నారు జఫర్గడ్ మండలం లో వందలాది ఎకరాల లో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల వ్యవసాయ బోర్లు ఎండిపోయి వందలాది ఎకరాల్లో వరి పంట ఎండి పోయిందని తీవ్రంగా నష్టపోయారని అన్నారు ఎండిపోయిన పంటపొలాలో పశువులు మేపుతున్న దుస్థితి నెలకొందన్నారు ఎండిపోయినా వరిపంటకు ఏకరానికి 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్టేషన్గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మండలానికి కాలువ ద్వారా సాగునీరు అందిస్తామని పంటలు ఎండిపోతున్న పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలనే సోయి లేకపోవడం దారుణమన్నారు స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి ఎగువ ప్రాంతం దయాకర్ రావు హరీష్ రావు నియోజకవర్గాలకు నీళ్లు పోతున్న ఘన్పూర్ రిజర్వాయర్ కు పక్కనే ఉన్న జఫర్గడ్ మండలానికి మాత్రం నీళ్లు రావడం లేదన్నారు రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మండలంలోని చేరువులు కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపాలని డిమాండ్ చేశారు
తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన కొంతం లక్ష్మీనారాయణ అనే రైతు మూడు ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయింది అన్నారు తన పంటను కాపాడుకోవడం కోసం రెండు బోర్లు లక్ష రూపాయలు అప్పు చేసి వేసిన నీళ్లు రాలేదని బోరున ఏడ్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా కొంతం నరసయ్య వడ్లకొండ యాదమ్మ చిలివేరు ఎల్లయ్య మాదిరిగా తమ గోడును వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల గ్రామ నాయకులు గుండెబోయిన రాజు, వేల్పుల రవి, గంగరాజు, నక్క యాకయ్య, శంషోద్దిన్ మల్లేష్ అంబేద్కర్,పెద్దరాములు, సుధాకర్, భాషా యాకూబ్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.