పంటల వివరాల నమోదు సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

కలెక్టర్ చాంబర్ నందు జిల్లా పంటల అంచనా మరియు రీ కన్సిలేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ గణాంక వివరాలు నమోదుచేసినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మండల ప్రణాళికా గణాంక అధికారులు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలంలో వేసిన పంట వివరాలు ఒక క్రమ పద్ధతిలో అందజేయాలని నివేదికలు పంపినపుడు అధికారులు పరిశీలించి పంపాలని కలెక్టర్ తెలిపారు. వాన కాలంలో వేసిన పంటలు వివరాలు నిర్ధారించుటకు కలెక్టర్ ఉద్యాన శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ప్రణాళిక అధికారిని రైతులు వేసిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం కంటే పంటల నమోదు తక్కువగా ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శామ్యూల్, నీటిపారుదల శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, యస్ఓ రత్నమాల, డిఎస్ఓ కె. మహిన మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.