పండిన యాసంగి (రబి) వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి (రబి) వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలనీ తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ మహబూబాబాద్ ప్రత్యేక సమావేశం ను కుమారి అంగోత్ బిందు ,గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్,మహబూబాబాద్ గారు ప్రారంభిస్తూ వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే తీర్మానం నకు మద్దతు ఇస్తూ ఈ ప్రత్యేక సమావేశం నకు వచ్చిన గౌరవ ఎం ఎల్ ఎ శ్రీ DS రెడ్య నాయక్ గారికి, గౌరవ ఎం ఎల్ ఎ శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారికి, గౌరవ ఎం ఎల్ ఎ శ్రీమతి సీతక్క (ధనసరి అనసూయ) గారికి, ఎం ఎల్ సి శ్రీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు గారికి మరియు విచ్చేసిన జెడ్పీటీసీ లు, ఎంపీపీలు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని దేశంలో అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా చూడకుండా ఒక్కో రాష్ట్రమును ఒక్కో విధముగా చూస్తూ తన బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో వాటికి అనుకూలంగా ప్రతి పక్ష రాష్ట్రాల్లో వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ప్రతి పక్ష రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేయాలని బిజెపి ప్రభుత్వం చూస్తున్నదని ముఖ్యంగా తెలంగాణ ను ఇబ్బందుల పాలుచేసి మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారధ్యంలో శరవేగంతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నదని అందువల్లే కెసీఆర్ గారు మిషన్ కాకతీయ, కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, బావులు, కాలువలు అన్ని నీటితో తొణికిసలాడుతూ రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండి తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారుతున్నది అని అందుకే తెలంగాణలో పండిన యాసంగీ వరి ధాన్యం కొనమని చెబుతున్నారని దానివల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది అని అలా జరిగితే రాష్ట్రం అభివృధ్ధి కుంటు పడుతుంది అని కావున రైతుల కష్టాలు తీర్చేలా పంజాబ్,హర్యానాలో ధాన్యం సేకరించినట్లు తెలంగాణలో కూడా కేంద్రం మిగులు ధాన్యాన్ని ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయించాలని , రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేసినామని ఇట్టి తీర్మానం ను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులందరికీ ధన్యవాదములు తెలుపుతూ ఈ తీర్మానం ప్రతులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారికి , కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి పంపిస్తున్నాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ DS రెడ్య నాయక్ గారు, గౌరవ మహబూబాబాద్ శాసన సభ్యులు శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు, గౌరవ ములుగు శాసన సభ్యులు శ్రీమతి సీతక్క (ధనసరి అనసూయ) గారు, ఎం ఎల్ సి శ్రీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక గారు, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కుమారి అభిలాష అభినవ్ గారు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీ మంగళం పల్లి శ్రీనివాస్ గారు, సీఈఓ రమాదేవి గారు,జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.