సముద్రాల లో యువకుడి దారుణ హత్య

E69 news:- జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం లోని సముద్రాల గ్రామ శివారులో సముద్రాల గ్రామానికి చెందిన ముహమ్మద్ ఆజిమియా (33)అనే యువకుడిని బుధవారం అనగా నిన్న గొంతు కోసి దారుణంగా హత్య చేసిన విషయం విదితమే.కాగా నిన్న రాత్రి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
” పక్కా ప్లాన్ “
మృతదేహాన్ని పరిశీలించి చూస్తే ఇది ఒక్కరు చేసిన హత్య కాదనిపిస్తుంది.పక్కా ప్లాన్ తో కొంత మంది కలిసి చేసినట్లు తెలుస్తోంది.
“హత్యకు గల కారణం”
హత్యకు గల కారణాలపై వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
తొలుత మృతుడి భార్య తరచు తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయేదని.ఐతే దీనితో మృతుడు ఒక రోజు తన స్నేహితుడితో కలిసి ఒక స్తీ దగ్గరకు …వెళ్ళితే ఆ స్త్రీ మూడువేల రూపాయలు డిమాండ్ చేయడంతో ఒక వెయ్యి రూపాయలు ఇస్తామంటే వినక వారిద్దరి పైన స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో తన ఒంటిపై నగలు దొంగతనం చేసినట్టు కేసు పెట్టిందని.దీనితో పోలీసులు వారిద్దరిని తీసుకుపోయి చితకబాదడంతో ఊళ్ళో తీర్మానం చేసుకుంటామని వచ్చారని.పంచాయితి పెద్ద మనుషులు మృతుడికి,తన స్నేహితుడికి కలిపి నలబై వేల రూపాయలు జరిమాన విధిస్తే ఆ డబ్బులు కట్టి సమస్య పరిష్కారం చేసుకున్నారని. ఐతే ఆ స్త్రీ భర్త ఆవిషయం తెలుసుకుని చంపాడా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
“భార్యే హత్య చేయించిందా?”
మృతుడి భార్య తరచు తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయేదని, పెళ్ళికి ముందే పుట్టింటి దగ్గరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని,అందుకే మాటిమాటికీ గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయేదని తన ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ తో చంపించిందని,హంతకులు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.