పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ

విభజన హామీలో పేర్కొన్న ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ ప్యాక్టరీ, గిరిజన యూనివర్సీటి, బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఇవ్వకుండా మోసం చేసిన Bjpకి, Trsకు ప్రస్తుత MLC ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య పిలుపునిచ్చారు.

దివి: 05-03-2021 శుక్రవారం రోజున స్థానికి Cpm జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి G.నాగయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విలేఖరులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిరుద్యోగులకు జయసారధి రెడ్డి గెలుపుతో న్యాయం జరుగుతుందని అన్నారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని Bjp, రాష్ట్రంలోని Trs అభ్యర్థులను ఓడించాలని కోరారు. ఈ దేశాన్ని, ప్రభుత్వ రంగాన్ని, ప్రజా ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలనేది మార్చి 14న జరుగబోవు ఎన్నిక ఫలితాల్లో ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం, వ్యాపారం ప్రభుత్వం పని కాదు, కేవలం నాలుగు సంస్థలు మాత్రమే ప్రభుత్వ రంగంలో వీలైనంత కనిష్ట పరిమాణంలో ప్రభుత్వ పెట్టుబడులతో ఉంటాయని మన దేశ ప్రధానమంత్రి రాబోవు రోజుల్లో దేశంలో ప్రభుత్వంరంగాన్ని మొత్తం ప్రయివేటు శక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించడం జరిగిందని ఈమధ్యనే ప్రకటించారని తెలిపారు. వీటి అమ్మకాల వల్ల 2.50 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చి వాటిని ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో పెద్దఎత్తున పోరాటాలు జరిగినవి ఈ సందర్బంగా 39 మంది చనిపోయారని తెలిపారు. ఆనాడు అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వాన్ని మెడలు వంచి విశాఖ ఉక్కు పరిశ్రమను తీసుకరావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగం అనేది లేనిచో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాన స్థాయిలో జరగదని తెలిపారు. కోవిద్ మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది, ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం చెందింది, నిరుద్యోగం పెరిగిందని ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని తెలిపారు. మన దేశంలో GDP వృద్ధి 4.2శాతం కనిష్ట స్థాయికి పడిపోయిందని తెలిపారు. దేశంలో వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలం చెందిందని తెలిపారు. రాష్ట్రంలో Trs ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతుందని ఈ ఎన్నికల్లో Bjp, Trs పార్టీ అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలంటే, ప్రశ్నించే గొంతు శాసన మండలికి పంపాలంటే ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు ఆలోచించి జయసారది రెడ్డికి మొదటి ప్రాధ్యాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, P.ఉపేందర్, రాపర్తి సోమన్న, సింగారపు రమేష్, సాంబరాజు యాదగిరి, సోమ సత్యం, ఎన్నకుస కుమార్, బోట్ల శేఖర్, పొదల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.