పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

జఫర్గడ్ మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం మండల అధ్యక్షుడు టి సురేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మరియు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బొడిగె శోభ, మరియు బిజెపి రాష్ట్ర నాయకులు మరియు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ మాదాసి వెంకటేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల ఇన్చార్జి ఊడుగుల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.బొడిగె శోభ మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని, అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని, ఐదు సంవత్సరాల పదవి కాలంలో నిరుద్యోగుల సమస్యలను, మరియు ఉద్యోగుల సమస్యలను, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను, విద్యార్థుల సమస్యలను పట్టించుకోని పాపాత్ముడుకీ మళ్లీ ఓట్లు అడిగే అర్హత లేదని స్పష్టం చేశారు.ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరారు. టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కెసిఆర్ బానిసా అని గెలిస్తే కెసిఆర్ కు గ్లాసులో మందు పోసుకుంటూ ఉంటాడు తప్ప ఏమీ చేయలేడని ఎద్దేవా చేశారు.బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశానికి మండల ఎస్సి మోర్చా అధ్యక్షుడు ఇల్లందుల సారయ్య మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఐలోని అంజి రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మరియు మండల సోషల్ మీడియా కన్వీనర్ చల్లా వినయ్ కుమార్ యాదవ్ మండల ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ మరియు ప్రధాన కార్యదర్శి మేరుగు రామరాజు ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు బానోతు అనిల్ మండల మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మండల ఉపాధ్యక్షులు యకస్వామి మండల కార్యదర్శి గర్వందుల శేఖర్ బూత్ అధ్యక్షులు గర్వందుల సతీష్ మండల నాయకులు మరియు కునూర్ గ్రామ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి శ్రీశైలం తమ్మడపల్లి జి గ్రామ ఇంచార్జి పందిబోయిన రాజు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.