పట్టభద్ర ఎన్నికల్లో జయ సారథి

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ వామపక్షాలు అభ్యర్థి గెలిపించండి, సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు మోకుకనకా రెడ్డి ,సిహెచ్ రాజ రెడ్డి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వామపక్ష పార్టీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, బలపరిచిన ఎమ్మెల్సీఅభ్యర్థి బి, జయ సారథి రెడ్డిని గెలిపించాలని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, సి.హెచ్ రాజ రెడ్డి పిలుపునిచ్చారు,పట్టభద్ర ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ,వామపక్ష పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాలు ,మద్దతు పోటీ చేస్తున్న జయ సారథి రెడ్డి గెలుపు కోరుతూ జనగామ జిల్లా కేంద్రంలో బైక్ యాత్ర ప్రారంభమై రఘునాథ్ పెళ్లి, స్టేషన్గన్పూర్, ఇప్పగూడెం, మీదుగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది, ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకి సిపిఎం సిపిఐ మండల కార్యదర్శి లు చిట్యాల సోమన్న, వలి పాషా అధ్యక్షత వహించగా వామపక్షాల ఎమ్మెల్సీఅభ్యర్థి జయ సారథి రెడ్డి, మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు, పిఆర్సి ఇవ్వలేదు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదు, ఖాళీగా ఉన్న మూడున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్యోగులకు నాశనం చేసే నిర్బంధ పదవీ విరమణ చట్టం తెస్తోందన్నారు,బ్యాంకులు ఎల్ఐసి బొగ్గు గనులు టెలికామ్ రైల్వే విద్యుత్ తరంగాలను ప్రైవేటుపరం చేసి నిరుద్యోగుల ఆశలు గండి కొడుతుంది అన్నారు,ఒక జర్నలిస్ట్ గా అన్ని వర్గాల అంశాలపై అవగాహన ఉన్న నేను ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని మీ హక్కులు సాధించేవరకు పోరాడుతానని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ జిల్లా నాయకులు రాపర్తి రాజు, జనార్ధన్ ,బూడిద గోపి, సింగారపు రమేష్, సోమ సత్యం, భూక్య చందు నాయక్, ముని గల రమేష్, తోట రమేష్, చొప్పరి సోమయ్య, మాచర్ల సారయ్య ,బానోత్ కిషన్ నాయక్, బెల్లి సంపత్, కూరపాటి విజయ్ కుమార్, పనికర రాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.