పట్టువస్త్రాలు సమర్పించిన మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి నరహరి కుటుంబ సభ్యులు ప్రతియేటా శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించే చింతగట్టుకు చెందిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఈ యేడు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను పంపించారు. వారి కుటుంబ సభ్యులు ఆదివారం నాడు స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు పార్థసారథి, శ్రీధరాచార్యులు వారి కుటుంబ సభ్యులు నుంచి పట్టువస్త్రాలు తీసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి నరహరి తల్లి సరోజన, సోదరులు రాము, శ్రీనివాస్, వేణు,దామోదర్ కుటుంబ సభ్యులు మహేశ్వరి,సుమలత, వైష్ణవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు