పత్రి ఒక్క కార్యకర్త కూడా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయలి

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించడం కోసం ఈ నెల25న నియోజకవర్గ కేంద్రంలోని శాసన సభ్యుని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారి
అధ్యక్షతన మరియు వచ్చే నెల7వ తేదీన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి
అధ్యక్షతన జరిగే మీటింగ్ లకు అధిక సంఖ్యలో పట్టభద్రులను తరలించడం కోసం మరియు ఎమ్మెల్సీ గెలుపు కోసం జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారి ఆధ్వర్యంలో
గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి గారి అధ్యక్షతన ‘గ్రామ ఎమ్మెల్సీ కమిటీని’ వేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్ గార్లు హాజరయ్యారు అనంతరం గుజ్జరి రాజు గారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పత్రి ఒక్క కార్యకర్త కూడా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయలన్నారు, అదే విధంగా ఎటువంటి వర్గ విభేదాలకు పాల్పడకుండా అందరూ కలుపుకుని పోయి పని చేయాలని కోరారు.అదే విధంగా కమిటీ అధ్యక్షుడిగా మారపల్లి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రమ్, ఉప అధ్యక్షుడిగా కొంతం నగేష్,కార్యదర్శిగా ఎం.డి మొయిన్ పాషా,సహాయ కార్యదర్శిగా వేల్పుల సురేష్,కోశాధికారిగా ఎం.డి బషీర్
గార్లను ఎన్నుకున్నారు.. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ&ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య
గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య
మండల రైతు విభాగం అధ్యక్షుడు పులిగిల్ల కుమార్
గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నక్క సోమయ్య
యూత్ అధ్యక్షుడు ఎం.డి రషీద్
గ్రామ పార్టీ నాయకులు పులిగిల్ల మల్లయ్య గార్లు మరియు పట్ట భద్రులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.