పదవీ విరమణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు

వరంగల్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ.వీరభద్రమ్ నాయక్ గారిని సన్మానించిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా. సామల శశిధర్ రెడ్డి దివి 30 12 2020 రోజున హనుమకొండలోని శ్రీ విష్ణు ప్రియ గార్డెన్స్ నందు జరిగిన వరంగల్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ భద్రమ్ నాయక్ గారి పదవీ విరమణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా. సామల శశిధర్ రెడ్డి హాజరై శ్రీమతి. శ్రీ భద్రం నాయక్ గారిని పూల మాల మరియు శాలువాతో సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు. భద్రమ్ నాయక్వ గారు హనుమకొండ మండలం తో పాటు వరంగల్ మండలానికి సైతం ఇంచార్జి మండల విద్యాశాఖ అధికారి గా పనిచేసి ఇ చాలా ఉన్న తమైన శిఖరాన్ని అధిరోహించారని దానితోపాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం కోసం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ లను ఏర్పాటు చేయడం మరియు విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి గుర్తు చేసుకున్నారు అలాగే ఈరోజు పదవి విరమణ చేయడం వల్ల విద్యాశాఖ లో ఒక గొప్ప వ్యక్తిని ఆయన సేవలను మర్చిపోలేక పోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ టీచింగ్ ఫోరం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ మరియు వివిధ సంఘాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.