పబ్లిక్ గార్డెన్స్ లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్ శ్రీమతి గుండు సుధారాణి

పబ్లిక్ గార్డెన్స్ లో ఇంకను అసంపూర్తగా ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్మార్ట్ సిటీ పథకం క్రింద పబ్లిక్ గార్డెన్స్లో చేపట్టిన అభివృద్ధి
పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం క్రింద సుమారు 11.5 కోట్లతో చేపట్టిన సూర్య నమస్కారాలు, యోగ, టౌన్ హాల్ నవీకరణ, లైటింగ్, పంచతంత్రం, ఆడిటోరియంలో మహిళలు, పురుషులు బట్టలు మార్చే గదులు, జిమ్ పరికరాలు, 2 క్యాంటీన్ గదులు, పాత్ వే తదితర పనులను పరిశీలించారు. ఇంకను మిగిలియున్న ఫీనిషింగ్ పనులను , వాకింగ్ ట్రాక్ పనులు, లైటింగ్ లకు విద్యుత్ కనెక్షన్ పనులు తక్షణమే పూర్తి చేయాలన్నారు.

గార్డెన్స్ లో సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గార్డెన్స్ లో పచ్చదనం పెంచుటకు మరిన్ని అలంకార మొక్కలను ఏర్పాటు చేయాలని,
గార్డెన్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా ఉద్యానవన విభాగ సిబ్బంది ఎప్పటికపుడు శుభ్రం గా నిర్వహణ జరగాలని ఆదేశించారు.

గార్డెన్స్ లొ చెత్తా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నందున ఇక్కడే కంపోస్టు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈ.ఈ. లు బి.ఎల్ శ్రీనివాస రావు, లక్ష్మారెడ్డి, డీ.ఈలు రవికుమార్ సంతోష్ బాబు,సంజయ్ కుమార్,ఏ. ఈ. అరవింద,స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటితదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.