E69న్యూస్ రేగొండ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం, రామన్నగూడెం తండా గ్రామంలో పరకాల నుండి జూబ్లీ నగర్ వరకు బస్ సర్వీస్ ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ,
ఈ రోజు రేగొండ మండలం, రామన్నగూడెం తండా గ్రామంలో పరకాల నుండి జూబ్లీ నగర్ వరకు బస్ సర్వీస్ ప్రారంభించుకోవడం మంచి శుభపరిణామం అన్నారు.
అదే విధంగా ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.
కాబట్టి ప్రజలందరూ ఈ బస్ సర్వీస్ ఉపయోగించుకుని మీ మీ గమ్యాలను సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.
అదే విధముగా అడగగానే బస్ సర్వీస్ ఏర్పాటు చేసిన పరకాల బస్ డిపో మేనేజర్ గారికి ప్రజల తరుపున ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.
అదేవిధంగా ఇట్టి సర్వీస్ ను ప్రజల సౌకర్యార్థం ములుగు వరకు నడపాలని డిపో మేనేజర్ ని కోరారు.
అనంతరం టికెట్ తీసుకుని బస్ లోని ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసి,మండల పార్టీ అధ్యక్షులు,పిఏసి స్ చైర్మన్, వైస్ చైర్మన్,డైరెక్టర్లు ఆలయ కమిటీ చైర్మన్,గ్రామ సర్పంచ్ లు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.