E69 న్యూస్.. పరకాల నియోజకవర్గ … …. పరకాల లో ఘనంగా ఇఫ్తార్ విందు హజ్రత్ గౌసే అజాం పరకాల ముస్లిం కమ్యూనిటీ సొసైటీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని జామా మస్జిద్, ఈద్గా మజీద్, మదీనా మజీద్,లలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ అజ్మతుల్లా షరీఫ్, (బాబా )ఎండి బియబాని మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఒక నెల ఉపవాసాలు(రోజా ) ఉండే ముస్లిం ఉపవాసులకు అనేక రకమైన ఫ్రూట్స్ (పండ్లు ) ల ద్వారా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ విందులో మత పెద్దలు అల్ హజ్ మహమ్మద్ యాకుబ్, మహమ్మద్ జైనులవొద్దీన్, ఎండీ గౌసోద్దీన్, పరకాల మస్జీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జలాలోద్దీన్, సెక్రటరీ మహమ్మద్ హాజీ మలంగ్, అడ్వకేట్ మహమ్మద్ సాబీర్, మరియు సొసైటీ సభ్యులు, కమిటీ సభ్యులు ఎంఏ అబ్దుల్ సత్తార్, ఎం ఏ కలీం, ఎండి మున్నా, ఎండి శౌకత్, యాకూబ్ పాషా,బబ్లు, అల్లావుద్దీన్, జమాలుద్దీన్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.