పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల లో ఎక్కించు కుంటే కఠిన చర్యలు

:- సిఐ కనకారావు

నందిగామ పట్టణంలో సోమవారం సాయంత్రం నందిగామ సీఐ కనకారావు, ఎస్ ఐ లు తాతాచార్యులు, హరి ప్రసాద్ వారి సిబ్బంది తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రవాణా చేస్తున్న 10 ఆటోలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కనకారావు మాట్లాడుతూ వాహనదారులు లైసెన్సు లేకుండా వాహనాలను నడప రాదని, 18 సంవత్సరాలు దాటని పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించ వద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించ రాదని, ప్రయాణికులు కూడా అశ్రద్ధ తో త్వరగా గమ్యస్థానాలకు వెళ్లే తొందరలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్న ఆటోలలో ఎక్కేందుకు సిద్ద పడతారని అటువంటి అశ్రద్ధ వహించ వద్దని తెలిపారు. వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువమంది ప్రయాణికులు ఆటోలో ప్రయాణించినచో, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పరిమితికి మించి ఆటోలో ప్రయాణించ వద్దని, ఎక్కాల్సిందే అంటే అటువంటి ఆటోలో ప్రయాణం చేయవద్దు అని తెలియజేశారు. ఈరోజు 10 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని, సీజ్ చేసిన ఆటోలను రవాణాశాఖ అధికారులకు అప్పజెప్పడం జరుగుతుందని, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.