సూర్యాపేట మున్సిపల్ పరిధిలో గల స్థానిక 27వ వార్డులో వార్డు కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సహకారంతో నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు వృద్ధి చెందకుండా ఉండటానికి ఆయిల్ బాల్స్ ను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో సూర్యాపేట ఆరోగ్యకరంగా ఉందని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని దోమలు వృద్ధి చెందకుండా ఉండేలా వార్డ్ ప్రజలు చర్యలు చేపట్టాలని కోరారు. వార్డు జవాన్ వేణు, సిబ్బంది పాల్గొన్నారు