ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్ర _శైలి విశ్లేషణ”అనే అంశంపై ఎం ఫిల్ భాషాశాస్త్రంలో బంగారు పతకం పొందనున్న దర్గా పాష ముహమ్మద్

నేడు 20 తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా అవార్డు పొందనున్న దర్గా పాష

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన దర్గా పాష అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం

రాయపర్తి జులై 19

ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన దర్గా పాష ముహమ్మద్ (జావేద్ అహ్మద్) శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి ఎం.ఫిల్ భాషాశాస్త్రంలో శ్రీ ఎం.ఎస్ రామయ్య ఫిలాంత్రోపిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ ఆఫ్ కర్ణాటక వారి స్వర్ణ పతకం పొందుటకు అర్హుడయ్యారు.
వారు డాక్టర్ జి.యస్.గాబ్రియేల్ గారి పర్యవేక్షణలో “హజరత్ ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర _శైలి విశ్లేషణ”
అనే అంశంపై ఎం.ఫిల్ పట్టా మరియు స్వర్ణ పతకం సాధించారు.
ఈనెల 20 వ తేదీ బుధవారం రోజున రవీంద్ర భారతిలో జరుగు శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్ 15 వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా దర్గా పాష ముహమ్మద్ ఈ బంగారు పతకాన్ని పొందనున్నారు.
దర్గా పాష వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వారు. బాల్యంలోనే వారు తండ్రిని కోల్పోయారు. తల్లీ మహరున్నిసా సంరక్షణలో పెరిగారు.ప్రాథమిక విద్య గ్రామంలోనే సాగింది.పదవ తరగతి అనంతరం ధార్మిక విద్యను అభ్యసించుటకు పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ గ్రామానికి వెళ్లి జామియతుల్ ముబష్షిరీన్ కళాశాలలో మూడు సంవత్సరాలు చదువుకుని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో వివిధ గ్రామాలలో ధార్మిక బోధనలు చేస్తున్నారు. దర్గా పాష అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.