#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ లు అన్నారు. ఆదివారం మునగాల మండల పరిధిలోని కృష్ణానగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అడుగంటిపోయాయి అన్నారు. ప్రజలు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లే పరిస్థితి నుండి నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి అన్నారు. గ్రామాల అభివృద్ధి తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని గ్రామ స్వరాజ్య స్థాపనే సీఎం కేసీఆర్ లక్ష్యమని వారు పేర్కొన్నారు. నేడు పట్టణాలకు దీటుగా గ్రామాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామ పంచాయతీలకు నెల నెల గ్రామ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. పచ్చదనానికి పల్లె ప్రకృతి వనరులు ప్రతీకలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీలను ఘనంగా సన్మానించారు. శివుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎంపీలు ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లు ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ సుధారాణి పుల్లారెడ్డి, సర్పంచ్ లింగా రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నందికొండ సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు నలపాటి శ్రీనివాసరావు, కొల ఉపేందర్, ఎలక వెంకట్ రెడ్డి, బండారు సత్యనారాయణ, ఉపేందర్ గౌడ్, వీరారెడ్డి, అనసూర్య,రామయ్య, టిఆర్ఎస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.