పవిత్ర రంజాన్ ప్రార్థనలలో జాగ్రత్తలు పాటించండి

శ్రీరామనవమి సంబరాలు ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలి.. ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి..
కరోనా వైరస్ అధిగమించేందుకు నిబందనలకు లోబడి రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని, శ్రీరామనవమి సంబరాలు ఇళ్ళలోనే చేసుకోవాలని జిల్లా ప్రజలకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ కారణంగా శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగలను ఇళ్ళలోనే చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయని..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మహబూబాబాద్ జిల్లా ప్రజలు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సహకరించి కరోనా వైరస్ అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు. బయటకు వచ్చినపుడు తప్పకుండా మాస్కు ఉపయోగించాలన్నారు. నిత్యావసరాల కోసం బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని అన్నారు. సానిటైజర్లు, సబ్బులతో చేతులు కడుక్కోవడం మరవద్దు అని అన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.