ప‌శువుల‌కు ప్రాథ‌మిక చికిత్స చేసే శిక్షణ‌ ముగింపు కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ – సెర్ప్ – ద్వారా ప‌శు మిత్ర – డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌శువుల‌కు ప్రాథ‌మిక చికిత్స చేసే శిక్షణ‌ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

కార్యక్రమానికి ముందే, ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించిన మంత్రి

కార్య‌క్ర‌మం అనంత‌రం శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి కిట్లు అంద‌చేసిన మంత్రి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్

 ప‌శువులు, గొర్లు, మేక‌లు వంటి సంప‌ద గ్రామీణ ప్రజ‌ల‌కు అత్యంత కీల‌క‌మైన జీవ‌నోపాధి గ‌ల‌ ఆదాయ వ‌న‌రులు.
 తెలంగాణ రాష్ట్రంలో ప‌శు, గొర్రెలు, మేక‌లు, కోళ్ళు వంటి సంపద‌కు కొదువ లేదు
 భూమి లేని నిరుపేద‌లు ఈ ప‌శు సంప‌ద మీదే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు
 అయితే పేద రైతులు తాము ఆశించిన స్థాయి ఫ‌లితాలు, లాభాల‌ను ప‌శు పోష‌ణ ద్వారా పొంద‌లేక‌పోతున్నారు.
 ప‌శు పోశ‌ణ‌లో వారికి త‌గినంత అవ‌గాహ‌న, మెల‌కువ‌లు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం
 ఈ ర‌క‌మైన లోపాల‌ను స‌రిదిద్ది, గ్రామీణ ప్రాంతాల్లో ప‌శుపోష‌ణ‌పై ఆధార‌ప‌డే వారి కోసం “సెర్ప్” IKP ప‌శు ఆధారిత జీవ‌నోపాధిని పెంచుతున్నాము.
 సెర్ప్‌, డ్వాక్రా (స్వయం స‌హాయ‌క సంఘాల‌) మ‌హిళ‌ల‌కు ప‌శు సంప‌ద‌ను వారి జీవ‌నోపాధిగా అందిస్తున్నది.
 ఆవులు, బ‌ర్రెలు, గొర్రెలు, మేక‌లు, పెర‌టి కోళ్ళ పెంప‌కం వంటి వాటిని అందిస్తున్నది.
 దీనికి కొన్ని కోట్లాది రూపాయల రుణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నాము .
 అయితే, ప‌శువులు, గొర్రెలు, మేక‌లు రోగాల బారిన ప‌డినప్పుడు వెంట‌నే, మందులు ఇంజ‌క్షన్లు ఇచ్చే స‌రైన శిక్షకులు గ్రామాల‌లో లేరు
 ప‌శు సంవ‌ర్థక శాఖ నుండి గోపాల మిత్ర లాంటి శిక్షకులు ఉన్నా, వారు త‌గినంత‌గా లేక మ‌న మ‌హిళ‌లు ప‌శు పోష‌ణ‌లో తీవ్రన‌ష్టాలు ఎదుర్కొంటున్నారు.
 ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మ‌హిళా సంఘాల మ‌హిళ‌ల‌కు ప‌శుమిత్రల పేరుతో, వారికి ప‌శు సంప‌ద ప్రాథ‌మిక చికిత్సపై శిక్షణ అందిస్తున్నది.
 ప‌శు సంప‌ద‌లో న‌ట్టల మందులు, రోగాల నివార‌ణ‌, టీకాలు, దానా, ప‌శు పోష‌ణ‌, వాటి పున‌రుత్పత్తి వంటి అంశాల్లో 6 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నది.
 24 గంట‌ల పాటు పాడి రైతుల‌కు అందుబాటులో ఉండి, చికిత్స ర‌క‌ర‌కాల సేవ‌లు అందించ‌డానికే ప‌శు మిత్రల ఆలోచ‌న చేశారు.
 10వ త‌ర‌గ‌తి చ‌దివిన ఆస‌క్తిగ‌ల 2వేల 359 మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌శు మిత్ర శిక్షణ అందించారు.
 ఇది పూర్తిగా స్వయం ఉపాధి కార్యక్రమం
 ఈ ఏడాది క‌నీస ప‌శు వైద్య సేవ‌లు అందుబాటులో లేని గ్రామాల నుండి 1250 మందిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప‌శు గ‌ణాభివృద్ధి సంస్థ ద్వారా 6 రోజుల శిక్షణ ఇవ్వడం జ‌రిగింది.
 ఈ త‌ర్వాత ప్రతి బ్యాచ్‌కు 60 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.
 ప‌శు వైద్యంలో పేరున్న డాక్టర్ల చేత ఈ శిక్షణ ఇప్పించ‌డం జ‌రిగింది.
 ఈ శిక్షణ తీసుకున్న ఒక్కొక్కరి మీద ప్రభుత్వం, 7వేల 500 రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నది
 అలాగే ప‌శు వైద్య కిట్‌, మందుల కిట్ ల‌ను క‌లిపి ఒక్కో కిట్ కు 2వేల 500 రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నది.
 శిక్షణ పూర్తయిన తర్వాత పశుమిత్రలకు సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఈ శిక్షణ త‌ర్వాత ప‌శుమిత్రలు అందించే సేవా కార్యక్రమాలు :
• పశుసంవర్థక శాఖ సమన్వయంతో గొర్రెలు, మేక‌లు, ప‌శువుల‌కు న‌ట్టల మందులు అందించి, టీకాలు వేస్తారు.
• ఈ సేవ‌లు చేసినందుకు ప్రభుత్వం ప‌శుమిత్రల‌కు నిర్ణీత గౌర‌వ వేత‌నం చెల్లిస్తుంది.
• గొర్రెలు, మేక‌లు, ప‌శువుల‌కు ప్రాథ‌మిక చికిత్స చేయ‌డం ద్వారా నేరుగా రైతుల నుండి సేవా చార్జీలు తీసుకోవ‌చ్చు
• అలాగే ప‌శు మిత్రలు ప‌శువులు, గొర్రెల వ్యాధులు, వాటి నివార‌ణ, ప‌శు పోష‌ణ‌లో శాస్త్రీయ యాజ‌మాన్య ప‌ద్ధతుల‌ను అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.
• పశువులకు మేత ను అభివృద్ధి చేయడానికి అవ‌స‌ర‌మైన రీతిలో రైతులను ప్రోత్సహిస్తారు.
• LFPGల నెలవారీ మీటింగుల్లో పాల్గొంటూ, రైతుల‌కు ప‌శుపోష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. LFPG రికార్డులను నిర్వహిస్తారు.
• గ్రామ స్థాయిలో రైతుల‌కు 24 గంట‌ల‌పాటు ఎమర్జెన్సీ సేవ‌ల‌ను అందించ‌డానికి సిద్ధంగా ఉంటారు.
• ప‌శు మిత్రలు రైతుల‌కు అందించే వివిధ సేవ‌ల ద్వారా నెల‌కు 5వేల నుంచి 6వేల వ‌ర‌కు సంపాదిస్తారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి, సెర్ప్ సిఇఓ సందీప్ కుమార్ సుల్తానియా గారు మాట్ల‌డుతూ, కార్య‌క్ర‌మ ఉద్దేశాల‌ను వివ‌రించారు. దేశంలోనే వినూత్నంగా ప‌శు మిత్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌శు సంప‌ద‌పై ఆధార‌ప‌డి జీవించే రైతుల‌కు స‌రైన వైద్యులు, శిక్ష‌ణ‌, ప‌శు పోష‌ణ‌పై అవ‌గాహ‌న వంటివి అందుబాటులో లేవ‌న్నారు. అందుకే అనేక అంశాల్లో విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్న స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కే ఈ శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని త‌ద్వారా మంచి సేవ‌లు అందుతాయ‌న్న ఆకాంక్ష‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న పశు మిత్రల్లో ఇద్దరు మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.

అంజలి
ఈ పథకం అద్భుతంగా ఉంది. మాకు మంచి శిక్షణ ఇచ్చారు. మాకు పశు వైద్యంపై మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు మేము రైతులకు అండగా ఉండగలం.

స్వర్ణలత
మేము శిక్షణ తీసుకోవడం గర్వంగా ఉంది. మహిళా సంఘాలు బాగా లబ్ధి పొందుతున్నాయి

శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ హరి కృష్ణ
మహిళలు మంచి శిక్షణ తీసుకున్నారు. పశువుల డాక్టర్లకు ఏండ్ల తరబడి ఇచ్చే శిక్షణను 60 మంది మహిళలకు 6 రోజుల్లో ఇవ్వడం జరిగింది. పశుమిత్రలు రాష్ట్రంలో రైతాంగానికి అదృష్టం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.