పామిడిలో బి ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి

భారత రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత ,ఆర్థిక వేత్త ,న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అయిన ,భారత్ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా, స్థానిక పామిడి పట్టణం , ఎద్దులపల్లి సర్కిల్ నందు ఉన్న అంబేద్కర విగ్రహానికి పూలమాలవేసి ,ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన, బంజారా గిరిజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రామవత్ సురేష్ నాయక్ .అనంతం సురేష్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఆనాటి సమాజంలో ఉన్న అంటరానితనం,కుల నిర్మూలనా వ్యవస్థను నిర్మూలించడానికి అహర్నిశలు కష్టపడి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం, భారత రాజ్యాంగాన్ని నిర్మించి, ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించి, అనగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించి, ఆర్థిక ,రాజకీయ ,సామాజిక అన్ని రంగాలలో అవకాశాలు కల్పించిన ఫల ప్రదాత, అంతేకాకుండా స్వేచ్ఛ, సమానత్వం , సౌభ్రాతృత్వం అంశాలను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని నిలుపుట లో అంబేద్కర్ గారు చేసిన కృషి ఎనలేనిది, అట్టడుగు స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించా రో, ప్రజలకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు… కావున సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను, ఆశయాలను, ఆయన అడుగుజాడలలో నడిచి, సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని , ఈ జయంతి సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరప్ప, అరికటికే పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, బంజారా గిరిజన సమాఖ్య సలహాదారు డాక్టర్ ఆంజనేయులు నాయక్,పామిడి పట్టణ 4 వ వార్డ్ శివ,మరియు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.