పాముకాటుకు గురై యువ రైతు మరణం

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో కొంతం మల్లయ్య కుమారుడైన సోమయ్య ఈరోజు వ్యవసాయ పొలంలో వరిచేనుకు నీరు పెట్టేందుకు మధ్యాహ్న సమయంలో గట్టు పైనుండి వెళ్ళుతున్న క్రమంలో విషపాము కాటువేసిన వెంటనే వైద్యం కోసం జఫర్ఘడ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకు వెళ్ళగా అక్కడి వైద్యులు ఇక్కడ పాము కాటుకు వైద్యం లేదని వర్ధన్నపేట కు వెళ్ళమని చెప్పగా వర్ధన్నపేటకు వెళ్ళితే అక్కడ కూడా అదే సమాధానము చెప్పి వరంగల్ ఎంజిఎం కు వెళ్ళమన్నారు.సోమయ్య ఎంజిఎంకు చేరుకుని వైద్యం చేస్తుండగానే మృతిచెందాడు.సరియైన సమయంలో వైద్యం అందక సోమయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.మృతుడికి భార్య ముగ్గురు కూతుళ్లు కాగా ఒక కూతురు వివాహం జరిగింది.నిరుపేద కుటుంబానికి చెందిన సోమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు,గ్రామస్థులు కోరుతున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.