*
సేవ్ పాలకుర్తి ఫోరం డిమాండ్
పాలకుర్తి పట్టణంలో గల పెద్దమొరిని సేవ్ పాలకుర్తి ఫోరం ప్రతినిధులు సోమవారం సందర్శించడం జరిగింది.
పాలకుర్తి పట్టణంలోని డ్రైనేజీ, ఈ కాల్వ గుండా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వాగులో కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలువ మట్టి కురుకుని పోయి అధ్వానంగా తయారైంది. సైడ్ డ్రైనేజీ శిథిలమై కూలి అధ్వానంగా తయారైనా పాలకుర్తి పాలకవర్గం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. లక్షల ఆదాయం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సేవ్ పాలకుర్తి ఫోరం డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో సేవ్ పాలకుర్తి ఫోరం అధ్యక్షుడు మామిండ్ల రమేష్ రాజా, ప్రధాన కార్యదర్శి దుంపల సంపత్, ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, జీడి హరీష్, కోశాధికారి జీడి సోమయ్య, ఫోరం మహిళ కన్వీనర్ అనంతోజు రజిత, మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు
i love this very appropriate article