పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకున్న బస్సు జాతా

కార్పోరేట్ అనుకూల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలితెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్,
దివి:13/01/2021రోజు నా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాతా ఈరోజు పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్బంగా citu సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న,అధ్యక్షతన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షుడు మూడ్ శోభన్నాయక్ , మోకు కనకా రెడ్డిలు, మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళనలు నిర్వహిస్తున్నారు.స్వేచ్ఛ మార్కెట్ పేరుతో వచ్చిన చట్టంగానీ కాంటాక్ట్ వ్యవసాయ చట్టంగానీ రైతులకు ఏమాత్రం మేలు చేయకపోగా మరింత నష్టం చేస్తాయి.కార్పోరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల లోకి చొరబడి రైతాంగం నుండి కారుచౌకగా కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముకుని లాభాలు గడించుకునేందుకు ఉపయోగపడతాయి.నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టం మొత్తం భారత ప్రజానీకానికి వ్యతిరేకమైంది.స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడుతుంది.2013లో వచ్చిన ఆహారభద్రత చట్టానికి తూట్లు పొడుస్తోంది విద్యుత్ సవరణ బిల్లు రైతులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్తును దూరం చేస్తుంది.ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇరవై అయిదు లక్షల బోరు బావుల తో వ్యవసాయం నడుస్తోంది వీరందరికీ ఉచిత విద్యుత్ లేకుండా పోతోంది ఫలితంగా రైతులపై మరింత భారం పడుతోంది.సామాన్య గృహవినియోగదారులపై కూడా అదనపు భారం పడుతోంది విద్యుత్ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది.రైతుల కోరిక నా చట్టాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు.2018 నుండి దేశవ్యాప్తంగా స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని కేరళ తరహాలో రుణ విమోచన చట్టం చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి.2006లోని బీహార్లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు దీనివల్ల కంపెనీలు రైతుల దగ్గర కొనుగోలు చేస్తాయని రైతులు లాభపడతారని నమ్మబలికారు కానీ నేడు బీహార్ లో కనీస మద్దతు ధరలు కూడా అమలు కావడం లేదు.3వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతనే రైతులతో చర్చలు జరపాలని దేశవ్యాప్త రైతు సంఘాలు కోరుతుండగా కేంద్రం మాత్రం సవరణలు చేస్తామని ప్రకటిస్తున్నది చివరకు సుప్రీంకోర్టు జోక్యం కలిగించుకొని ద్వారా లో రైతుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో తామే ఒక కమిటీ వేసి పరిష్కరిస్తామని కూడా చెప్పారు ఇంతవరకు జరిగిన ఆందోళనలపై కేంద్రం ఏకపక్షంగా దాడికి పూనుకున్నది రైతులపై వాటర్ క్యానన్లు టియర్ గ్యాస్ లాఠీఛార్జీలు చేసి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసారు ఇంత నిర్బంధం ఉపయోగించిన రైతులు శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నారు ఇక్కడ ఒక చిన్న హింసాత్మక ఘటన జరగకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి దాదాపు 44మంది చనిపోయినా తీవ్రమైన చలిలో కూడా మొక్కవోని దీక్షతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.ఇప్పటికైనా ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలోతెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య, రైతు సంఘం జిల్లా నాయకులుమిట్యా నాయక్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిసొమ సత్యం రైతు సంఘం జిల్లా నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి మాచర్ల సారయ్య,గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందు నాయక్, ప్రజా సంఘాల నాయకులు మాసంపల్లి నాగయ్య ,బానోత్ కిషన్, ముస్కు ఇంద్రరెడ్డి , బెల్లీ సంపత్ ,సోమ అశోక్, బాబు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.