ఈ69న్యూస్ పాలకుర్తి మే01
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముస్లింలకు రంజాన్ కానుకగా బట్టలు పంపిణీ చేశారు.అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హయాంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని,మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని,షాధిముబారక్ పథకం దేశానికే ఆదర్శమని అన్నారు.
బీజేపీ పార్టీ కుల మతాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు,టిఆర్ఎస్ నాయకులు ముస్లింలు పాల్గొన్నారు.
