mahabubad news local news

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని తానం చెర్ల గ్రామ శివారు చాంప్లా తండా కు చెందిన 23 మంది కూలీలు పాలేరువాగు లో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న మరిపెడ జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, టిఆర్సీస్ నాయకులు తేజావత్ రవీందర్ లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు. అవతలి కూలిలతో ఫోన్లో సంప్రదిస్తూ డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసో రెడ్యానాయక్ ఆదేశానుసారం ఎప్పటికప్పుడు వారికీ మనోధైర్యాన్ని ఇస్తు వారికి కావాల్సిన తాగు నీరు, ఆహారాన్ని రాంపురం టిఆర్ఎస్ నాయకులు రాంపల్లిరవీ, సర్పంచ్ లతో కలసి డ్రోన్ల సహాయంతో అవతలి | ఒడ్డుకు • పంపించారు. ఎప్పటికప్పు వారి యోగ క్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకుంటు, సమాచారాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయకు అందించారు. శనివారం ఉదయాన్నే అందరు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటంతో కుటుంబసభ్యులు రెండు తండాల వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి, అధికార యంత్రాంగానికి, రాత్రి నుంచి అక్కడే ఉండి తండా వాసులు యోగ క్షేమాలు తెలుసుకుంటూ రెస్య్యూకు సహకరించిన టిఆర్ ఎస్ నాయకులు తేజావత్ రవీందర్కు ఎమ్మెల్యే రెడ్యానాయక్ జిల్లా కలెక్టర్ అధికారులు, ప్రజలు హ్యాట్సాఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తానంచర్ల ఎంపిటిసి జీ రమేష్, రాంపల్లి రవీ రాంపురం సర్పంచ్, కోట్యీ తండా టిఆర్ఎస్ యువ నాయకులు బాలాజీ నాయక్, ఆజ్మిర తండా సర్పంచ్ శ్రీను దేవీక, తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.