(Cpm కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య పిలుపు)

కమ్యూనిజం అజేయం!

(Cpm కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య పిలుపు)

కమ్యూనిస్టులు నిరంతరం పీడిత ప్రజల కోసం, దోపిడీ వ్యవస్థ నిర్ములనకోసం వారి జీవితాలనే అర్పిస్తారని కమ్యూనిస్టులుగా బతకాలంటే చాలా కష్టమని, అలాజీవించిన వారే చిరకాలం ప్రజలగుండెల్లో ఉంట్టారని అలాంటి వ్యక్తే అంబటి సత్యనారాయణ అని cpm కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య తెలిపారు.

దివి: 22-02-2021 సోమవారం రోజున జనగామ పట్టణంలోని బాణాపురంలో *కామ్రేడ్ అంబటి సత్యనారాయణ సంస్మరణ సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిజం అజేయమని, కమ్యూనిస్టుగా బ్రతికినప్పుడే ఆ విలువ తెలుస్తుందని అన్నారు. అంబటి సత్యనారాయణ పీడిత ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. సత్యనారాయణ కమ్యూనిస్టుగా బ్రతికినందుననే ఈ రోజు చనిపోయిన మన మధ్య, ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు. పార్టీ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారికి ఎల్లవేళలా అండగా ఉంట్టుందని తెలిపారు. దోపిడీ వ్యవస్థ నిర్ములనకోసం ప్రతిఒక్కరు సత్యనారాయణ లాగ జీవించాలని అన్నారు. వారి ఆశయ సాధన కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు B.ప్రసాద్, KGKS రాష్ట్ర కార్యదర్శి రమణ, పార్టీ సిద్దెపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి Ch.రాజారెడ్డి, ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, రాళ్లబండి శశిధర్, దాసరి కళావతి, బూడిది గోపి, P.ఉపేందర్, S.యాదగిరి, G.బాపురెడ్డి, S.సత్యం, P.నాగరాజు, B.శేఖర్, B.నరేందర్, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు, కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.