పక్కభూమి వారు తన భూమిలోకి వెళ్ళకుండ అడ్డుకుని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పురుగుల మందు తాగి ఓ యువరైతు ఆత్మహత్యకు పూనుకున్న ఘటన సూర్యాపేట జిల్లా మోతె తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో చోటుచేసుకుంది,,,,
అన్నారిగూడెం గ్రామానికి చెందిన దున్నపోతుల పుల్లయ్య అనే రైతు తన స్వంత భూమిలోకి రానివ్వకుండా పక్క భూమి వాళ్ళు అడ్డుకుంటున్నారని, రెవిన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు