పుాలే జీవితం నేటీ యువ తరానికి ఆదర్శం-కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

నేటి నాగరిక సమాజం కోసం నాడు జోతిభా పూలే తాను క్రొవ్వొత్తిలాగా కరిగి వెలుగులు పంచాడని ఆయన కృషి వల్లే దేశములో మెజార్టీ ప్రజలకు విద్య దక్కిందని ఆయన స్పూర్తితో సమానత్వ ఉద్యమాలు నిర్మించాలని పుాలే జీవితం నేటీయువ తరానికి ఆదర్శం అని కేవిపి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.
సోమవారం దొడ్డి కొమురయ్య భవనం వద్ద కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్)ఆద్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ భారత దేశంలో మూడు వేల ఏండ్ల మనుస్మృతి అధర్మ శాస్త్రాలు మెజార్టీ ప్రజలకు చదువు సంపదలన్నింటిని దూరం చేసిందని,మనుషులందరు సమానులే అందరికి సమాన అవకాశాలుండాలనే దృఢసంకల్పం తో జోతిభా పూలే తుది శ్వాస వరకు కృషిచేశాడని కొనియాడారు 1848లోనే మొట్టమొదటి బాలికల పాఠశాల నెలకొల్పి శూద్రులకి మహిళలకు చదువు నేర్పిన గొప్ప మానవతా వాదీ అని అన్నారు పురోహిత వర్గం దేశంలో పరాన్న బుక్కులుగా ప్రజలను మూఢత్వం లో ఉంచుతూ ఆధ్యాత్మికత పేరిట అందరిని దోపిడి చేస్తుందని పూలే ఆ రోజుల్లోనే గుర్తించాడని చెప్పారు ఆయన స్వయంగా దండల పెళ్లిళ్లు జరిపించాడని చెప్పారు క్రైస్తవులు బైబిల్ చదీవినట్లుగా,ముస్లింలందరు కూర్చోని ఖురాన్ చదివినట్లుగా హిందూ మత గ్రంధాల్లో ఏముందో వాటిలో ఉన్న బండారం బయట పడాలంటే అందరికి అందులోని విషయాలు తెలియలన్నారు గులాంగిరి వంటి అనేక పుస్తకాలు ఆయన రాశాడని చెప్పారు నేటి కేంద్ర బీజేపీ సర్కార్ పూలే ఆశయానికి బిన్నమైందని చెప్పారు. అందిరికి విద్య కోసం పూలే కృషి చేస్తే ప్రభుత్వం నూతన విద్యావిధానం తెచ్చి రిజర్వేషన్లు లేకుండా కోట్లు ఉన్న వాళ్ళకే చదువు అనే కొత్త పాలసీ తెచ్చిందన్నారు పేదలను విద్యకు దూరం చేస్తుందన్నారు మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తే నేటి బీజేపీ సర్కార్ మహిళలపై హింసను పెంచిందన్నారు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ ఎందుకు చట్టం చేయడం లేదని విమర్శించారు పూలే ఆశయాలు యింకా పూర్తి కాలేదన్నారు మహనీయులకు కులాలు మతాలు ప్రాంతాలు ఆపాదించే వారు మూర్ఖులని చెప్పారు పూలే ఒక గొప్ప సంస్కర్త సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాతగా ప్రతీ ఒక్కరు ఆయన జీవితం నుండి నేర్చుకొని మరొకరికి చెప్పాలన్నారు
పూలే స్ఫూర్తి నేటి తరం చాలా నేర్చుకోవలన్నారు చనువు సమానత్వం కోసం ఆయన తుదిశ్వాస వరకు కృషి చేశాడని చెప్పారు. సాంఘీక దూరాచారాలపై ఆయన నచేసిన కృషి కొలవలేనిదని చెప్పారు.
ఈ జయంతి కార్యక్రమం లో రైతు వికాస నాయకులు బండ శ్రీశైలం నారీ ఐలయ్య సీఐటీయూ నాయకులు చినపాక లక్ష్మీనారాయణ దండెంపల్లి సత్తయ్య పద్మా అద్దంకి నర్సింహా గంజి మురళీధర్ కొండా వెంకన్న కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు రవీందర్ కెవిపిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.