పూలే అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయండి-పాలడుగు నాగార్జున

ఎప్రిల్ 12నుండీ 18 వరకు . సమసమాజ నిర్మాణం కోసం నిమ్నజాతుల అభివృద్ధి కొరకు జీవితాంతం పరితపించి తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులైన పూలే -అంబేడ్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.
ఈ రోజు స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా స్థాయి విస్తృత సమావేశం కొండేటి శ్రీను జిల్లా అధ్యక్షుని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దేశంలో ఏప్రిల్ 5 న బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఏప్రిల్ 11 న మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14 న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఏప్రిల్ 12 వ తేదీన నల్లగొండ పట్టణంలో నీలి కవాతు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదే రోజు సాయంత్రం పూలేఅంబేద్కర్ సందేశ్ యాత్ర ప్రారంభమై 18 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో జిల్లావ్యాప్తంగా పూలే అంబేడ్కర్ సందేశ్యాత్రను నిర్వహించి సభలు జరుపుతామనీ తెలిపారు.గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైజరుగుతున్న మనువాదుల దాడిని సమావేశం తీవ్రంగా ఖండించింది. మరియు దేశంలో రాజ్యాంగాన్ని రోజుకో పేజీ లెక్కన చింపే కుట్రలకు మనువాదులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాలకు చెందిన రిజర్వేషన్లను తొలగించే కుట్ర సీరియస్గా జరుగుతుందని అన్నారు . దాని పర్యావసానమే ప్రభుత్వరంగ సంస్థలు పెట్టుబడిదారులకు ధారాదత్తం చెయ్యడమని అన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలుపై మరో ఉద్యమం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు.దేశంలో దళితులపై మహిళలపై దాడులు అధికమయ్యాయని హత్యలు అత్యాచారాలు కులహింస పేట్రేగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనువాదులకుట్రలను ఛేదించుటకు యువతీయువకులు సమాయత్తం కావాలని అన్నారు.నేడు యువతీ యువకులు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మారి అన్నమో రామచంద్రా అనే పరిస్థితులు దాపురిస్తున్నాయని అన్నారు.నేటి పాలకుల దుశ్చర్యల పై పోరాడటానికి ప్రతిఒక్కరూ భుజం భుజం కలిపి పోరాడాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకిచ్చిన వాగ్దానాలైన మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బుట్టదాఖలయ్యాయని అన్నారు.ఎస్సీ ఎస్టీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేసి నిధులు విడుదల చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరుశరాములు జిల్లా సహాయ కార్యదర్శులు జిట్టా నగేష్ గాదె నర్సింహ దైద శ్రీను జిల్లా కమిటీ సభ్యులు దొంతాల నాగార్జున దండు రవి మల్లయ్య దైదా జనార్దన్ గంట కంపు రమణయ్య బడే అజయ్కుమార్ వెంకన్న రవి మల్లేశం నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.