పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ను జయప్రదం చేయండి

ఏప్రిల్ 12న సుార్యాపేట లో నీలి దండు కవాత్
ఏప్రిల్ 16నుండి 22 వరకు జిల్లా వ్యాప్తంగా పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర ఏప్రిల్ 30 న అంబేద్కర్ జాతర
రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) సుార్యపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం యం వి యన్ భవన్ లో జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన ఈరోజు జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ నెల ను మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న నీలి దండు కావాత్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు సుార్యాపేట జిల్లాలో ఏప్రిల్ 16 నుండి 22వ తేదీ వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 30న సుార్యాపేట జిల్లా కేంద్రంలో పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 12న జిల్లా కేంద్రంలో నీలి టీ షర్ట్ వాలంటీర్ల కావాత్ ఉంటుందని ఈ కార్యక్రమంలో జిల్లా లో సామాజిక ప్రజాసంఘాలు యాత్రకు సహకరించి జయప్రదం చేయాలని కోరినారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించీ దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మనువాదుల కుట్రలను అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ – ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే ఏప్రిల్ 5న జగ్జీవన్రామ్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టేకుల సుధాకర్ జిల్లా నాయకులు జఁగపల్లి శ్రీను, రవి కాంపాటి లక్ష్మణ్, మేరుగు అంబేద్కర్, నందిపాటి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.