పూలే ఆశయాలకు అనుగుణంగా ఉద్యమిస్తాం

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంజిల్లాఅధ్యక్షుడ దేశ గాని కృష్ణ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆశయాలకు అనుగుణంగా ఉద్యమిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దేశగాని కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతిరావు పూలే 195 వ జయంతి పురస్కరించుకుని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు

గునిగంటి మోహన్ పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

పూలే ఆశయాలకు అనుగుణంగా ఉద్యమిస్తామని ఆయన అన్నారు.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్ మాట్లాడుతూమనువాదుల గుండెల్లో సింహ స్వప్నమయ్యారురని

మనిషిని మనిషిగ చూడని జన్మమెందుకన్నారు
సమసమాజ స్థాపనే తన లక్ష్యమన్నారు
మహాత్ముడై ఇల వెలిసి మాలో నిత్య స్ఫూర్తి నింపారు పూలే అని వారున్నారు.

సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతో కృషి చేసి భారత సామాజిక సంస్కర్తల్లో అగ్రగణ్యుడుగా నిలిచారు .1890 ఏప్రిల్ 11న జన్మించిన మహనీయుడు జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్, బాలహత్య ప్రతిబంధక్ గ్రుహాలయం, సేవాసదనం వంటి సంస్థల్ని నెలకొల్పి వాటి ద్వారా బహుజనుల, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పసునాది విజయ్, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకు, సుధా గాని వెంకటయ్య, చంద్రయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.