పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా భారీ నిరసన

ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డు పై బైటాయించిన టీఆరెఎస్ శ్రేణులు
వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్
బిజెపి ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోంది సామాన్య ప్రజానీకానికి గుది బండగా పెట్రోల్, గ్యాస్ ధరలు
పెంచిన ధరలను తగ్గించే వరకు ప్రజల పక్షాన టీఆరెఎస్ పోరాటం ఆగదు
ఎంపీపీ రడపాక సుదర్శన్ జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి మండల సమన్వయ కర్త పసునూరి మహేందర్ రెడ్డి

పేద,మధ్యతరగతి ప్రజల పై పెను భారం అయ్యేలా పెట్రోల్,గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆరెఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపు మేరకు జఫర్గడ్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జఫర్గడ్ చౌరస్తా వద్ద మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చెపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై బైటయించి నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అచ్చే దిన్ ఆయేగా అచ్చే దిన్ ఆయేగా అని సామాన్య ప్రజలు బ్రతకలేని స్థితికి తీసుకువచ్చి సచ్చే దిన్ తీసుకువచ్చారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా,బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆరెఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు.ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని పేర్కొన్నారు. పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు గుది బండగా మారాయని వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ఏడాపెడా రేట్లు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ, దేశాన్ని, దేశ ప్రజలను పాతాళంలోకి నెడుతున్న బీజేపీ పార్టీని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య జఫర్గడ్ ఎంపీటీసీ 1జ్యోతి రజిత- యాకయ్య ఎంపీటీసీ 2 ఇల్లందుల స్రవంతి మొగిలి నియోజకవర్గ నాయకులు పెండ్లి స్వామి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గాదె పరీన్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్ పెంతల రాజ్ కుమార్ ఎంపీటీసీ గోనె సంధ్య -రాజేష్ కో ఆప్షన్ నెంబర్ నజీర్ మండల మహిళా అధ్యక్షురాలు గోలి కవిత రెడ్డి హిమ్మత్ నగర్ సర్పంచ్ తాటికాయల అశోక్ ఒబులాపూర్ నీరజ రెడ్డి తిమ్మాపూర్ సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు కూనూరు సర్పంచ్ ఇల్లందుల కుమార్ చిల్పురు గుట్ట దేవస్థానం డైరెక్టర్ ఎల్లమ్మ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు కుల్ల రాజు శ్రీధర్ జఫర్గడ్ మండల పరిధిలోని ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.