పెంచిన ధరలను నిరసిస్తూ బీఎస్పీ రాస్తారోకో

దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్, విద్యుత్,ఆర్టీసీ ఛార్జీల ధరలను నిరసిస్తూ బహుజన సమాజ్ వాదీ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కోదాడలోని స్థానిక రంగా థియేటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జిల్లా ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక పక్క చమురు ధరలు పెంచుతూ కేంద్రం, మరోపక్క విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ రాష్ట్రం, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచి పెడుతూ పేదప్రజలపై అదనపు చార్జీలు మోపడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని,ఉద్యోగం,ఉపాధి అవకాశాలు పాతాళానికి పోతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం సామాన్య ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నా పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని తెలిపారు.లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కోశాధికారి కందుకూరు ఉపేందర్,నాయకులు పాతకోట్ల శ్రీనివాస్, రెమిడాల లింగయ్య, నెమ్మాది సురేష్, రాజేందర్, ఏడుకొండలు,
మండవ శ్రీనివాస్ గౌడ్,కంపాటి సోమయ్య,కర్ల ప్రేమ్,రెమిడాల నర్సయ్య,ముదిగొండ వెంకటి,ముదిగొండ నాగయ్య,దశరధ, కుటుంబరావు, నెమ్మది అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.