కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జిలకు నిరసనగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్డి బొమ్మల దహనం కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడి, రాష్ట్రంలో కెసిఆర్ మాయమాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి రెండవ సారి అధికారంలోకి వచ్చారని అన్నారు. నిత్యం ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. దేశ రైతాంగాన్ని మోడి కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానిలకు తాకట్డు పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని, బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమం తరహాలో పోరాటం చేయడానికి తెలంగాణ రాష్ట్రములోని మేధావులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6 వ తేదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మందితో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది