- డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి
అడ్డూ అదుపు లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయనిడోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు నెట్టబడిందని, తరచూ ధరల పెరుగుదలతో ప్రజలకు మూడు పూటల భోజనం కరువైతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయకుండా.. ధరలు పెంచి మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విద్యుత్ వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీని కారణంగా కూరగాయలు, పండ్లు, కిరాణా వస్తువులు, బియ్యం, రోజువారీ ఉపయోగించే ఇతర వస్తువులు ఖరీదైనవిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజల ఆదాయంలో ఏ మాత్రం పెరుగుదల లేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వంకొరడా ఝలిపిస్తోందన్నారు. ధరలను వెంటనే తగ్గించకపోతే భవిషత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.