పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ములుగు జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా రాస్తో రోకో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
దోపిడి మనస్తత్వాన్ని వీడి కష్ట కాలములో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి గారు
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా గారి ఆధ్వర్యములో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ములుగు జాతీయ రహదారి పై ధర్నా రస్తో రోకో ప్రధాన మంత్రి మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి గారు హాజరై మాట్లాడుతూ
గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయిలు దండుకున్నారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని, దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుందని అయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ ఈ దోపిడీ మనస్తత్వాన్ని వీడి, కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని, వెంటనే పెట్రోల్ డీజల్ గ్యాస్ బస్ ధరలు తగ్గించాలని నల్లెల కుమారస్వామి గారు డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ లూటీకి హద్దులేకుండా పోతోందని, ప్రజలని దోచుకుని తినేయాలనే బీజేపి ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ, బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుందని విమర్శించారు
మోడీ సర్కార్ కేవలం వ్యాపార మనస్తత్వంతో నడుస్తుందని, క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు సహజంగానే పెట్రోల్ ధర తగ్గాలి కానీ పెట్రోల్ ధర ఆకాశానికి తాకుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు దాటిందని మండిపడ్డారు. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కూడా భారత్ కంటే పెట్రోల్, డీజల్ ధరలు తక్కువ వున్నాయని భట్టి గుర్తు చేసారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చుతానని ప్రగల్భాలు పలికిన మోడీ, దేశాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారని, ఈ అసమర్ధ పాలన, దోపిడీని ఆపాలంటే మోడీ సర్కార్ ని గద్దె దించాల్సిన అవసరం వుందని అయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మచ్చ శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
అసంఘి టిత కార్మికుల జిల్లా అధ్యక్షులు బాగ్ వాన్ రెడ్డి
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్
చెన్నోజు సూర్య నారాయణ,
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం, ల్యద శ్యాం రావు, కొంగ రీ నరేందర్
మాజీ సహకార సంఘం చైర్మన్ కునురి అశోక్ గౌడ్,మహిళ మండల అధ్యక్షురాలు సర్పంచ్ గోల్కొండ శైలజ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు
సురేష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేణి కుమార్,
గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజయ్య, మచ్చా శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ షకీల్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు హేమాధ్
ఒంజల లింగన్న,ప్రభాకర్,చింత నిప్పుల భిక్ష పతి, గందే శ్రీను
యాసం రవి కుమార్,ఏల్లవుల అశోక్, జక్కుల సాంబయ్య
దేవ్ సింగ్,మాజీ సర్పంచ్ అశోక్
కిషోర్,సుధాకర్,శ్రీకాంత్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్,కిషోర్
శ్రీధర్,రాజేందర్,మురళి,రాజు
మేడం రమణ కర్,ప్రశాంత్,కవ్వం పెల్లి సారయ్య,తోట సాంబయ్య
గ్రామ కమిటీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,జనగాం నాగరాజ్,ఉప సర్పంచ్ మర్కా జయశంకర్,సహకార సంఘం డైరెక్టర్ బోయిని రాజు
గొర్రె ఆంకుస్,జన్నే ప్రసాద్ రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.