రేగొండ మండల కేంద్రంలో జిల్లా తెరాస అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో రాస్తారోకో
E69న్యూస్ రేగొండ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో తెరాస నేత గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
పెట్రోల్,డీజల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పేద,మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ తెరాస పార్టీ ఆధ్వర్యంలో రేగొండ మెయిన్ రోడ్ లోని ఇందిరమ్మ విగ్రహం దగ్గర 30 నిమిషాల పాటు ధర్నా నిర్వహించి, రోడ్డుపై గ్యాస్ సిలిండర్ నెత్తి మీద పెట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.రోడ్డు మీద కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపారు. పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై 3కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మండల తెరాస అధ్యక్షులు రాజేందర్,జిల్లా నాయకులు మోడెం ఉమేష్ గౌడ్, జడ్పీటీసీ సభ్యులు సాయిని ముత్యం,హాజరై కార్యకర్తలను ఉదేశించి ప్రసంగించడం జరిగింది.
తెరాస జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోడీ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పేద,మధ్య తరగతి ప్రజలపై ఆర్ధిక భారం వేస్తున్నారని,ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం తగ్గించకుండా పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్లు రుణ మాపి చేస్తు ఉన్నవారికి లాభం చేస్తూ లేని వారికి మోసం చేస్తోందని విమర్శించారు. అదేవిధంగా ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తా అన్న నరేంద్ర మోదీ ఉన్న ఆదాయం తగ్గేలా ధరలను రెట్టింపు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు ప్రజలు పెంచుకుంటూ పోతుంటే భరించారు కానీ నేడు ప్రజలు నిజం తెలుసుకొని తెరాస చేస్తున్న పోరాటాలకు మద్దతు తెల్పుతున్నారని ఇప్పటికైనా నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినట్లే పేద,మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులను రాయతీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, వివిధ గ్రామాల తెరాస నాయకులు, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి, తెరాస కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొని నిరసనకు మద్దతూ తెలిపారు.