పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి మోటార్ వాహన చట్టం 2019 ని వెనక్కి తీసుకో కోవాలి


— సిపిఎం జిల్లా కార్యదర్శి మొకు కానుక రెడ్డి

: కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మోటార్ వాహన చట్టం 2019వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకుకనుకారెడ్డి డిమాండ్ చేశారు *శుక్రవారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రం లోని చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశానికిసిపిఎం నాయకులు ఐలేని జనార్ధన్ అధ్యక్షత వహించగా, ఈ సందర్భంగా కనకా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ

  • కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు, బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇప్పటికే కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవాణా రంగా కార్మికులతో పాటు ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైతున్నారని అన్నారు, తక్షణమే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు ,రవాణా రంగ కార్మికులకు నష్టం చేసే మోటర్ వాహన చట్టం 2019 ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు*
    రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాల సవరణలు నిలిపివేయాలని అన్నారు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడ కుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా జిల్లా కమిటీ సభ్యులు సింగారపు రమేష్, సోమ సత్యం, సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.